ప్రబాస్ మీద బెట్టింగ్ మామూలుగా లేదు.!
- June 02, 2022
ప్రబాస్ మీద బెట్టింగా.? ఏ విషయంలో అనుకుంటున్నారా.? ప్రబాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సలార్’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ ఇంకోటి.
‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మరొకటి. ఈ మూడు సినిమాలూ భారీ బడ్జెట్ సినిమాలే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమాలే. పోనీ హీన పక్షం 350 కోట్లు వేసుకున్నా మూడింటిపై దాదాపు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలే. ఈ సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇదే స్థాయిలో జరుగుతుంది.
అందుకే దీన్ని బెట్టింగ్ అనాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే, భారీ అంచనాలతో అతి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందే ‘సాహో’ దెబ్బ కొట్టింది. ఇంత అనుభవం అయ్యాకా కూడా, ప్రబాస్ విషయంలో ఇంత ఓవరాక్షన్ చేస్తే ఖచ్చితంగా నష్టపోవడం ఖాయమే అంటున్నారు ట్రేడ్ పండితులు.
బ్యాడ్ లక్ వెంటాడి సినిమా ఫ్లాప్ అయితే దారుణమైన నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ఒకవేళ అన్నీ కుదిరి సినిమా హిట్టయితే.. అప్పుడూ నష్టాలు భరించక తప్పదు. ఎందుకంటే, హిట్టయినా, ఫ్లాప్ అయినా డబ్బులొస్తాయన్న నమ్మకాలు పూర్తిగా పోయాయ్. హిట్టయితే మూడు వారాలు, లేదంటే, వారమే.. ఇదీ ధియేటర్ సినిమా విషయంలో నయా ట్రెండ్.
ఇదంతా తెలిసి కూడా ఈ మూడు సినిమాల విషయంలోనూ ప్రి రిలీజ్ బిజినెస్ అదేనండీ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో డిస్ర్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టాలు చవి చూశారు. ఆ నష్టాల ఊబిలోంచి వాళ్లను బయటపడేయడం ఎవ్వరి తరమూ కాలేదు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారా.? అంటే .. ‘ఏమో.! అవునని అంటారో, మరి కాదని అంటారో.. ఏమంటారో ఏమో అంటూ సందేహంలో.. ’ ఇలాగే వుంది పరిస్థితి.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







