అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లో అమ్మెనియా లీక్.. మహిళలకు అస్వస్థత
- June 03, 2022
అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్ పరిధిలోని పోరస్ కంపెనీలో అమ్మోనియా వాయువు లీకైంది.
దీంతో సమీపంలోని సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాయువు పీల్చడంతో మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు రావడంతో పాటు వాంతులు అయ్యాయి. పదుల సంఖ్యలో మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అమ్మెనియా పీల్చడంతో మహిళలు స్పృహ తప్పిపోయారని.. ప్రాణాపాయం ఉండదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పోరస్ కంపెనీలో అమ్మోనియా లీకేజీని నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. దాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







