అంటే..! నజ్రియాకి అదెక్కువ.!
- June 03, 2022
అప్పుడెప్పుడో ‘రాజు రాణి’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ నజ్రియా. మలయాళ భామ అయినా, అది డబ్బింగ్ సినిమా అయినా ఎందుకో తెలీదు కానీ, తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ‘అంటే సుందరానికి..’ సినిమాలో నజ్రియా హీరోయిన్ అంటే ఎవ్వరూ పెద్దగా ఫీలవ్వలేదు.
నిజానికి నజ్రియాకి పెళ్లయ్యింది. పిల్లలు కూడా వున్నారు. కానీ, హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందంటే అందుకు ఓ పెద్ద కారణముందట. ఏరి కోరి ఈ సినిమా కోసం ఎక్కడి నుండో నజ్రియానే తీసుకురావడానికి అదే బలమైన కారణమట.
ఇంతకీ అసలు విషయం అర్ధమైందా.? నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘అంటే సుందరానికి..!’ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నెల 10న ‘అంటే సుందరానికీ..!’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్లు జోరందుకున్నాయ్. ఆ క్రమంలోనే విడుదలైన ట్రైలర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరోయిన్ నజ్రియా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. లీల పాత్రలో క్రిస్టియన్ అమ్మాయిగా కనిపించనుంది ఈ సినిమాలో నజ్రియా. సుందరం పాత్రలో నాని తనదైన మ్యానరిజం ప్రదర్శించగా, తానేం తక్కువ కాదు అనేలా నజ్రియా అదరగొట్టేస్తోంది.
ట్రైలర్ అయితే బాగా కట్ చేశారు.. సినిమా ఎలా వుండబోతోందో. ఇక, నజ్రియా విషయానికి వస్తే, తెలుగులో చేసిన సినిమాలేం లేకపోయినా, అమ్మడికి ఫాలోయింగ్ మామూలుగా లేదండోయ్. సోషల్ మీడియాలో నజ్రియా నుంచి ఏ ఒక్క అప్‌డేట్ వచ్చినా ఇట్టే కనెక్ట్ అయిపోతున్నారు నెటిజన్లు. ఆ రేంజ్‌లో వుంది నజ్రియాకి ఫాలోయింగ్. నజ్రియాలో ఏం మ్యాజిక్ దాగుందో ఏమో.!
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







