అయ్యో పాపం బేబమ్మ: ఈ రూమర్లేంటమ్మా.?

- June 03, 2022 , by Maagulf
అయ్యో పాపం బేబమ్మ: ఈ రూమర్లేంటమ్మా.?

డైరెక్టర్‌తో పలానా హీరోయిన్ తిట్లు తిన్నదట. లేదు లేదు చెంప దెబ్బలు కూడా తినేసిందట.. ఇలాంటి రూమర్లు గతంలో చాలా సార్లు విన్నాం. కానీ, తాజాగా బేబమ్మ కృతిశెట్టి విషయంలో ఈ రూమర్లు వినిపిస్తున్నాయ్. అదేంటీ, ఆ కాలంలో అలా జరిగిందేమో. కానీ, ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వుందా.? అనే డౌటానుమానం రాక మానదు.

కానీ, ఓ సోషల్ మీడియాలో ఈ సరికొత్త రచ్చ నడుస్తోంది. బేబమ్మకు యాక్టింగ్ రాదంటూ ఓ వెబ్ ఛానెల్ రాసిన ఫేక్ కథనాలు నెట్టింట్లో ఈ చర్చకు దారి తీశాయ్. నిజమేనా.? బేబమ్మకి యాక్టింగ్ రాదా.? ఈ విషయమై ఆమె అభిమానులు గుస్సా అవుతున్నారు.

క్యూట్ అప్పీల్‌తో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేయించుకుంటోంది కృతి శెట్టి. వరుస అవకాశాలు దక్కించుకుంటూ త్వరలోనే స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకునే దిశగా కెరీర్‌లో ముందుకు వెళుతోంది. ఈ తరుణంలో బేబమ్మపై ఏంటీ అసత్య ప్రచారం.? అన్యాయమే కదా.!

ప్రస్తుతం కృతి శెట్టి, తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోంది. అదే ‘ది వారియర్’. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే యాక్టింగ్ రాదంటూ లింగు స్వామి, బేబమ్మని తిట్టాడంటూ ఓ వెబ్ ఛానెల్ ప్రచారం షురూ చేసింది. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘బుల్లెట్..’ సాంగ్‌లో కృతి శెట్టి అందాలు, హావ భావాలూ, డాన్సులూ అభిమానుల్ని తెగ అలరించాయి. అలరిస్తూనే వున్నాయ్.

బేసిగ్గా క్లాసికల్ డాన్సర్ అయిన కృతి శెట్టికి యాక్టింగ్ రాకపోయే ఛాన్సే లేదు. గొప్ప నటి కాకపోయినా, తనకిచ్చిన పాత్రకు న్యాయం చేయగల సత్తా వున్న నటి కృతి శెట్టి. అందులో నో డౌట్. ఎందుకు.? సదరు వెబ్ ఛానెల్ కృతి శెట్టిపై కక్ష కట్టి ఈ దుష్ర్పచారానికి తెర లేపినట్లు.? ఏమో సదరు ఛానెల్‌కే తెలియాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com