గర్భం దాల్చి వారికి తీర్థయాత్రకు అనుమతి లేదు ...
- April 08, 2016
సెంట్రల్ హజ్ కమిటీ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. హజ్ యాత్రకు నాలుగు నెలలు దాటిన గర్భిణిలు రాకూడదంటూ నిషేధం విధించింది. దరఖాస్తులు పెట్టుకునే సమయానికి గర్భం ధరించి ఉన్నవారు యాత్రను కొనసాగించేముందు ఆలోచించి అడుగు వెయ్యాలని హెచ్చరించింది. వాస్తవాన్ని దాచిపెట్టి హజ్ యాత్రను కొనసాగించినవారిని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించేది లేదని, అయితే విమానంలో మహిళలపై ఎటువంటి తనిఖీలు జరుపుతారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదని హజ్ అధికారులు స్పష్టం చేశారు.ఈ ఏడాది హజ్ యాత్ర సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందని బారెల్లీ హజ్ సేవా సమితి సెక్రెటరీ నజీమ్ బేగ్ తెలిపారు. అయితే కొత్తగా తీసుకున్న నిర్ణయాల మేరకు గర్భం దాల్చి నాలుగు నెలలు నిండిన వారిని తీర్థయాత్రకు అనుమతించేది లేదని, ఆ విషయాన్ని ధరఖాస్తు చేసుకునే ముందే మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.ఒకవేళ విషయం తెలియక యాత్రకు బయల్దేరినా వారు తనిఖీల్లో పట్టుబడితే వెనక్కు పంపించేస్తామని, ఎట్టిపరిస్థితిలో తీర్థయాత్రకు అనుమతించేంది లేదని స్సష్టం చేశారు. అంతేకాక వారి సీట్లను రద్దు చేసి డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని హజ్ కమిటి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెహ్మాన్ తెలిపారు.హజ్ యాత్రలోని మొదటి ఐదు రోజులు మనుషుల్లో సహన శక్తికి, ఓర్పుకు పరీక్షలాంటిదని, వారిని ఒకచోటనుంచి మరోచోటకు త్వరితగతిన తరలించడం జరుగుతుంటుందని, యాత్రలో భాగంగా అక్కడి పుణ్య స్థలాల్లో ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని, అటువంటి సమయంలో గర్భిణుల ఆరోగ్యం, భద్రత కోసమే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు హజ్ కమిటి సెక్రెటరీ బేగ్ తెలిపారు. మరోవైపు యాత్రలో ఉండగా గర్భిణులకు నొప్పులు వస్తే హజ్ కమిటి ఆస్పత్రిలో చేర్పించి తమ ఖర్చులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, అందుకే అటువంటి మహిళల యాత్రపై నిషేధం విధించాల్సి వచ్చిందని, దీంతో వారిని ముందుగానే పరీక్షించేందుకు కోరుతున్నామని బేరెల్లీ హజ్ సేవా సమితి ప్రెసిడెంట్, బహేరీ ఎమ్మెల్యే అతౌర్ రెహ్మాన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







