హాల్ మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి
- June 11, 2022
బహ్రెయిన్: వినియోగదారులు బంగారానికి సంబంధించి ప్రతి కొనుగోలుపైనా రసీదులు తీసుకోవాలని బహ్రెయిన్ అథారిటీస్ చెబుతున్నాయి. సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతోన్న అమ్మకాలకు దూరంగా వుడాలని అథారిటీస్ సూచించడం జరిగింది. కంట్రోల్ మరియు రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ అబ్దుల్ అజీజ్ అల్ అష్రాఫ్ మాట్లాడుతూ, బహ్రెయిన్ హాల్ మార్క్ కలిగిన ఆభరణాల్ని మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని చెప్పారు. క్యాపిటల్ గవర్నరేటులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో తనిఖీల సందర్భంగగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మార్క్ లేని ఆభరణాల విక్రయాన్ని గుర్తించారు. ఈ క్రమంలో చట్ట విరుద్ధంగా జరుగుతున్న అమ్మకాలపై ఉక్కు పాదం మోపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామనీ, ఉల్లంఘనల్ని ఉపేక్షించేది లేదనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







