జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో సీఎం కేసీఆర్
- June 13, 2022
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ పార్టీ ఏర్పాట్లను వేగవంతం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో ప్రకటన చేయనున్నారు. జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధులను కూడా ముందుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంత మంది నేతల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుండటంతో పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆయనను ఫోన్లో సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు, జాతీయ కార్యవర్గం వంటి అంశాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో కూడా చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







