భారత్ కరోనా అప్డేట్
- June 13, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 8,084 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 4,592 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.68 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.10 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.
భారత్‌లో ఆదివారం 11,77,146 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,19,81,150కు చేరింది. మరో 2,49,418 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 323,394కేసులు వెలుగుచూశాయి. మరో 540 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 540,487,950కు చేరింది. మరణాల సంఖ్య 6,331,430కు చేరింది. ఒక్కరోజే 380,775 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 515,672,844గా ఉంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







