నార్వే తమిళ్ ఫెస్టివల్‌లో భారతీయ వలసదారుడికి అవార్డ్
- April 09, 2016
7వ నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ వలసదారుడికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారతదేశంలోని తమిళనాడుకి చెందిన తస్లీమ్‌ఖాన్ 'వెట్టెనాపెసల్ - యాన్ ఈవినింగ్ అపాయింట్‌మెంట్ ' అనే షార్ట్ ఫిలింలో అద్భుతమైన నటనా ప్రతిభను చూపినందుకుగాను స్పెషల్ జ్యూరీ అవార్డ్‌ని అందుకోనున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు నార్వేలోని ఓస్లోలో జరిగే ఫిలిం ఫెస్టివల్‌లో ఈ పురస్కారం అందుకోనున్నారఱు తస్లీమ్ ఖాన్. ఒమన్‌లోని ఇంటెలిజెంట్ పార్కింగ్ అండ్ ఎలివేటర్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ పార్ట్‌నర్‌గా తస్లీమ్‌ఖాన్ పనిచేస్తున్నారు. విక్రమ్, ప్రభు అనే ఇద్దరు స్నేహితులు, ఒకరోజు సాయంత్రం రెస్టారెంట్‌లో కలుసుకుందామనుకుంటారు. అయితే విక్రమ్ ఆలస్యంగా వస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందనే పాయింట్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఫిలిం రూపొందించినట్లు దర్శకుడు చెప్పారు. ఈ అవార్డు రావడం పట్ల ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ ప్రతియేడాదీ ఈ అవార్డుల్ని అందిస్తోంది. బెస్ట్ ఫిలిం, డైరెక్టర్, యాక్టర్, యాక్ట్రెస్, మ్యూజిక్ డైరెక్టర్ తదితర కేగిరీలతోపాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులనూ అందిస్తోంది. ఉత్తమ చిత్రంగా కాక్కా ముట్టాయ్, ఉత్తమ దర్శకుడిగా మోహన్ రాజా, ఉత్తమ నటుడిగా విక్రమ్, ఉత్తమ నటిగా ఐశ్వర్యా రాజేష్, ఉత్తమ విలన్‌గా అరుణ్ విజయ్ ఈసారి అవార్డులకు ఎంపికయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







