10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని మోడీ కీలక ఆదేశాలు
- June 14, 2022
న్యూఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీలపై సమీక్ష నిర్వహించిన మోడీ.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అన్ని శాఖలలోని మానవ వనరుల ప్రస్తుత స్థితిగతులపై మోడీ సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది. నిరుద్యోగంపై విపక్షాలు పదేపదే విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా ప్రకటన రావడం గమనార్హం. ప్రభుత్వ శాఖలలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని పలువురు నేతలు ఇటీవల విమర్శలు చేశారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







