"రస్ అల్ ఖైమా" లో ఉగాది వేడుకలు
- April 09, 2016
రస్ అల్ ఖైమా లో సితార వసుధైక కుటుంబం వారు ఉగాది వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. "RAK Ceramics"లో ఉద్యోగం చేస్తున్న 1100 మంది తెలుగు వారంతా కలిసి "సితార - వసుధైక కుటుంబం" పేరుతో ఒక తెలుగు కమ్మ్యూనిటీ ని ASA Prasad (RAK Ceramics GM), Bala Brahmaiah (RAK Ceramics DGM) గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకొని మొట్టమొదటిసారిగా ఉగాది వేడుకలను లో దిగ్విజయంగా జరపడం గమనార్హం.
ప్రముఖ జ్యోతిష మహా సిద్ధాంతి, భక్తీ టి.వి మరియు ఈ టి.వి లలో రాశిఫలాలు వివరించే ప్రసిద్ధ జ్యోతిష్కులు శ్రీ.శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు దుర్ముఖి నామ సంవత్సర పంచాంగం చదివి వినిపించారు.
ఉదయం 9 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు యు.ఏ.ఈ ప్రార్ధనా గీతం మరియు "మా తెలుగు తల్లి" గీతంతో వేడుకలు ప్రారంభించడమే కాకుండా కూచిపూడి భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, భక్తీ గీతాలు, తంబోలా వంటి ఆటపాటలతో పాటు, ఇండియా నుంచి వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ ఫణి మాధవ్ గారి ప్రోగ్రాం అందరినీ అలరించింది.
చివరగా వేడుకలకు వచ్చిన ఆత్మీయులను, పెద్దలను ఘనంగా సత్కరించి సన్మానించారు.




తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









