10లక్షల ఉద్యోగాలపై స్పందించిన కేటీఆర్..
- June 16, 2022
10లక్షల ఉద్యోగాలపై స్పందించిన కేటీఆర్..
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన 10లక్షల ఉద్యోగాల భర్తీ పై స్పందించారు మంత్రి కేటీఆర్. వరుస ట్వీట్లతో కేంద్రం, ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు మంత్రి కేటీఆర్. 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాని మోది ప్రకటించారని, దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ యువత చేస్తున్న భారీ ఆందోళనతోనే ఇది సాధ్యపడిందన్నారు కేటీఆర్.
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కానీ.. అనేక హామీలు నెరవేర్చని కారణంగా మోదీని నమ్మడం కష్టమంటూ ట్వీట్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఉద్యోగాలు ప్రకటించడం మరో 'ఝుమ్లా'గా కనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. కొన్ని భయాలు, ప్రశ్నలు ఉన్నాయంటూ విమర్శించారు. అందులో మొదటిది.. కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంజూరైన 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో, రంగాల వారీగా, PSU వారీగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? చెప్పాలన్నారు.
ప్రమాదకరమైన ఆర్థిక విధానాల కారణంగా గత ఎనిమిదేళ్లలో దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీయే ప్రభుత్వం చేసిన కోలుకోలేని నష్టం, అన్యాయంపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ, పీఎస్‌యూ రంగాల్లో రిక్రూట్‌మెంట్ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ,ప్రైవేట్ రంగంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైపోయిందో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణలో గత 8 ఏళ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని.. మరో 1 లక్ష ఉద్యోగాల నియామకం ప్రారంభించామన్నారు మంత్రి కేటీఆర్. ఇదే నిష్పత్తిలో 2014 నుండి 140 కోట్ల భారత జనాభా కోసం మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను సృష్టించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో, దేశంలోని యువతకు వాగ్దానం చేసిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయో ప్రధాని మోదీ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







