సెవెన్ డేస్, సిక్స్ నైట్స్: అసలు కథేంటి బాస్.!
- June 20, 2022
ఎమ్మెస్ రాజు.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.సీనియర్ నిర్మాత. ఆయన నిర్మాణంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయ్.ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు కావచ్చు. ‘మనసంతా నువ్వే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలు కావచ్చు.
సినిమా ఏదైనా, ఎమ్మెస్ రాజు సినిమా అంటే, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొచి హాయిగా ఆస్వాదిస్తూ చూడదగ్గదే అవుతుందన్న నమ్మకం వుండేది.
కానీ, ఈ మధ్య ఆయన డైరెక్టర్‌గా మారారు. ‘డర్టీ హరి’ అనే ఓ అడల్ట్ కంటెంట్ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా విషయంలో భిన్న అభిప్రాయాలున్నాయనుకోండి. సరే, పోస్టర్ చూసి, సినిమా కథని అంచనా వేయకూడదు కూడా. కానీ, ‘డర్టీ హరి’ ప్రమోషన్స్ మాత్రం చాలా డర్టీగానే చేశారు మరి.
సరే, అది గడిచిపోయిన కథ. తాజాగా ఇంకో కొత్త కథతో మన ఎమ్మెస్ రాజు గారు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఏకంగా కొడుకు సుమంత్ అశ్విన్‌తోనే ప్రయోగం చేసేశారు. సుమంత్ అశ్విన్ హీరోగా ‘సెవెన్ డేస్, సిక్స్ నైట్స్’ అనే సినిమా వస్తోంది. ఇదే తరహా సినిమా.?
ట్రైలర్ చూస్తుంటే, అడల్ట్ కంటెంట్‌లాగే వుంది. పోస్టర్లు కూడా.. బికినీలతో వున్న హీరోయిన్లు.. బీచ్‌లో బికినీ పాపలతో ఎంజాయ్ చేస్తున్న హీరోలు.. ఇక లేటెస్టుగా రిలీజైన ట్రైలర్ విషయానికి వస్తే, అంతా బూతే. అదేనండీ అడల్ట్ కంటెంట్ అనే హింటే ఇస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులు, జుగుప్సాకరమైన సన్నివేశాలు.. ఇదీ పరిస్థితి.
అయితే, ఇది కూడా అడల్ట్ మూవీనేనా.? అనే అనుమానాలొస్తున్నాయ్. అంతేకాదు, డైరెక్టర్ అయ్యాకా, ఇట్టాంటి ఆలోచనలు చేస్తున్నాడెందుకీ పెద్దాయన.? అంటూ విమర్శలూ వస్తున్నాయ్. అయితే, ఎమ్మెస్ రాజుని తక్కువ అంచనా వేయకూడదు.
ప్రొజెక్షన్ ఇలా వున్నా కానీ, ఇంకోటేదో స్టన్నింగ్ అండ్ షాకింగ్ స్టోరీనో, మెసేజ్‌నో ఈ సినిమాతో చూపించినా చూపిస్తాడాయన. అదేంటో తెలియాలంటే, జూన్ 24 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే, ఆ రోజే ‘సెవెన్ డేస్, సిక్స్ నైట్స్’ సినిమా రిలీజ్ కాబట్టి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







