ఇంకోసారి ‘శభాష్’ అనిపించుకోబోతున్న తాప్సీ పన్ను.!

- June 20, 2022 , by Maagulf
ఇంకోసారి ‘శభాష్’ అనిపించుకోబోతున్న తాప్సీ పన్ను.!

తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ తాప్సీ పన్ను. క్యూట్‌గా గ్లామరస్ రోల్స్‌తో మెప్పించిన తాప్సీ, తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. బాలీవుడ్‌కి వెళ్లాకా, తాప్సీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన సౌత్ సినిమాని దుర్భాషలాడుతూ, దుమ్మెత్తిపోసింది. టాలీవుడ్ తనను కేవలం గ్లామర్ డాళ్‌గా మాత్రమే చూసిందనీ, ఇక్కడ హీరోల డామినేషన్ ఎక్కువనీ, స్టార్ డైరెక్టర్ల మీద కూడా అనవసర ఆరోపణలు చేస్తూ, తెలుగు సినిమాని అగౌరవపరిచేలా మాట్లాడింది.

ఆ తర్వాత తప్పు తెలుసుకుని సారీ చెప్పి, తన మాటలను వాపస్ తీసుకుందనుకోండి. ఇక, బాలీవుడ్‌లో తాప్సీ విషయానికి వస్తే, నిజమే, అక్కడికెళ్లాకా తాప్సీ నిజంగానే పూర్తిగా మారిపోయింది. గ్లామర్ ఇమేజ్‌కి గుడ్ బై చెప్పేసింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తో జెడ్ స్పీడులో ముందుకు దూసుకెళ్లింది.

ఒకటి కాదు, రెండు కాదు.. చాలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. యాక్టింగ్‌కి స్కోపున్న కథలను ఎంచుకుంటూ ప్రతిసారీ శభాష్ అనిపించుకుంది.తాజాగా తాప్సీ ‘శభాష్ మిథూ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మాజీ మహిళా ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కిన సినిమానే ‘శభాష్ మిథూ’. శ్రీజిత్ ఈ సినిమాకి దర్శకుడు. వయాకామ్ 18 సంస్థ నిర్మించింది.మహిళా క్రికెట్‌గా గ్లామర్ అద్దిన మిథాలీ రాజ్, క్రికెట్ దిగ్గజంగా ఎదగడానికి పడిన కష్టం, తపన, ఎత్తు పల్లాలూ.. అన్నింటినీ ఈ సినిమాలో చూపించబోతున్నారనీ లేటెస్టుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది. ఇక, మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీని  అయితే, ‘శభాష్’ అనాల్సిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com