కైతలాపూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- June 21, 2022
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నేడు నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ వల్ల కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య ప్రయాణం సాఫీగా సాగనుంది. బాలానగర్ వైపు నుంచి వచ్చే వారికి ఈ ఫ్లైఓవర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల జేఎన్టీయూ, మలేషియా టౌన్ షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కాగా, సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







