అపాచీ పరిశ్రమకు ఏపీ సీఎం జగన్ భూమి పూజ
- June 23, 2022
అమరావతి: సీఎం జగన్ నేడు శ్రీ బాలాజీ జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పరిధిలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. రూ.800 కోట్లతో ఇనగలూరులో లెదర్ యూనిట్‌ను నెలకొల్పేందుకు అపాచీ ముందుకు వచ్చింది.తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నఈ సంస్థ … రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది.ఈ యూనిట్‌లో ఆడిదాస్ షూస్, లెదర్ జాకెట్లు, లెదర్ బెల్టులను అపాచీ తయారు చేయనుంది.
ఈ యూనిట్‌కు భూమి పూజ చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. అపాచీ పరిశ్రమతో కొత్తగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే దక్కనున్నాయని ఆయన తెలిపారు. 2023 నాటికి ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు.
ఇదిలా ఉంటే… ఈ పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలోనూ జగన్ పాలుపంచుకున్నారు. అనంతరం తిరుపతిలో టీసీఎల్ గ్రూప్‌నకు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ తదితర కంపెనీలకు భూమి పూజ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







