బాలీవుడ్ బాద్‌షా మూవీలో రానా దగ్గుబాటి: నిజమేనా.?
- June 23, 2022
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ, షారూఖ్ ఖాన్ ఈ మధ్య కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ ట్రబుల్స్ కారణంగానే గత కొంత కాలంగా సినిమాలూ, షూటింగులకూ దూరంగా వుండిపోయారు బాద్‌షా. ఇక, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. అందుకు తగిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయట.
ఇంతవరకూ టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకి తాజాగా ఓ టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ‘జవాన్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అలాగే, మరో అదనపు అట్రాక్షన్ ఏంటంటే, ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
లేటెస్టుగా రానా పాత్రని ఫైనల్ చేశారట. ఈ సినిమాలో నటించేందుకు రానా కూడా ఉత్సాహంగా వున్నాడట. కానీ, ఈ వార్తపై ఇంకా అధికారికంగా క్లారిటీ రావల్సి వుంది. రానా ఎంట్రీతో తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సౌత్ క్వీన్ నయనతార నటిస్తోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







