నష్టాల్లో ఫేమస్ ఓటీటీ కంపెనీ..ఉద్యోగుల తొలగింపు..
- June 25, 2022
ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫేమస్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కూడా చేరింది.
ఈ కంపెనీ రెండోసారి ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇది కంపెనీ ఉద్యోగులలో 4 శాతం. మొదటిసారి నెట్‌ఫ్లిక్స్ చాలామంది సబ్‌స్కైబర్స్‌ని కోల్పోయిన తర్వాత ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులని తొలగించడం ఇది రెండోసారి. ఈ చర్య భాగంగా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ వేటు పడింది.
గత నెలలో కూడా ఉద్యోగుల తొలగింపు
గత నెలలో కూడా కంపెనీ ఉద్యోగులను తొలగించింది. నెట్‌ఫ్లిక్స్ గత నెలలలో 150 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే కంపెనీ ఒక ప్రకటనలో "మేము వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాం. తద్వారా మా ఖర్చులు పెరిగాయి. అందుకే ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగులని మెయింటన్ చేస్తున్నాం' అని సమాధానమిచ్చింది. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఓటీటీలో తీవ్రమైన పోటి కారణంగా కంపెనీ ఇటీవలి ఒత్తిడికి గురైందని తెలిపింది.
కస్టమర్ల సంఖ్య తగ్గుదల
మొదటి త్రైమాసికంలో చందాదారుల సంఖ్య తగ్గిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుత కాలానికి మరింత ఎక్కువ నష్టాన్ని అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఇతర పోటీ కంపెనీల చందాదారుల సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితిలో నెట్‌ఫ్లిక్స్ చందాదారులను పెంచడానికి చౌకైన ప్రణాళికలను తీసుకురావాలని ఆలోచిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







