సౌదీ వర్చువల్ హాస్పిటల్‌తో బహ్రెయిన్ ఒప్పందం!

- June 25, 2022 , by Maagulf
సౌదీ వర్చువల్ హాస్పిటల్‌తో బహ్రెయిన్ ఒప్పందం!

సౌదీ: బహ్రెయిన్‌ని సౌదీ వర్చువల్ హాస్పిటల్‌కి నెట్‌వర్క్ ద్వారా లింక్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాల ఉంటాయని సౌదీ, బహ్రెయిన్ ఆరోగ్య మంత్రులు చెప్పారు. ఈ విషయంలో ఒక ఒప్పందం కుదిరితే.. సౌదీ ఆసుపత్రితో అనుసంధానించబడిన మొదటి దేశంగా బహ్రెయిన్ నిలుస్తుందన్నారు. ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న తన బహ్రెయిన్ కౌంటర్ డాక్టర్ జలీలా అల్-సయ్యద్‌ను కలిశారు. ఈ సమావేశంలో వారు దేశాల మధ్య ఆరోగ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. వైద్య పరిశోధన, కొత్తగా వస్తున్న వ్యాధులు, వ్యాక్సిన్ అనంతర సమస్యలను పర్యవేక్షించడం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం వంటి రంగాలపై వారు చర్చించారు. అల్-జలాజెల్ వర్చువల్ హాస్పిటల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. అనంతరం బహ్రెయిన్ మంత్రి వర్చువల్ హెల్త్ హాస్పిటల్‌లో పర్యటించి, ఆసుపత్రి అందిస్తున్న సేవలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com