ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ ఖరారు
- June 25, 2022
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా జూలై 1 హైదరాబాద్ కు రానున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా ఈ సమావేశాలకే రావటంమే కాదు రెండు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
జులై 2న హైదరాబాద్ కు రానున్న మోదీ... మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు.రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లోనగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. పరేడ్ గ్రౌండ్ లో తలపెట్టిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పార్టీ విస్తృత ఏర్పాట్లు జరగుతున్నాయి. జులై 2, 3 తేదీల్లో నగరంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతలందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యం వహించనున్నారు. నడ్డా జులై 1నే హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమావేశాలకు వేదికగా నిలుస్తున్న నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా, చేయాల్సిన తీర్మానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
జులై 4వ తేదీన ప్రధాని మోదీ భీమవరంలో పర్యటిస్తారు. అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించునున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇక ఏపీకి మోదీ రానున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







