బహ్రెయిన్‌లో ‘మీర్’ చెల్లింపుల వ్యవస్థ

- June 26, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో ‘మీర్’ చెల్లింపుల వ్యవస్థ

బహ్రెయిన్: పర్యాటకుల కోసం రష్యన్ చెల్లింపు వ్యవస్థ అయిన మీర్‌(ఎంఐఆర్)ను ప్రవేశపెట్టాలని బహ్రెయిన్ యోచిస్తోంది. బహ్రెయిన్ పర్యాటకుల సౌకర్యార్థం ఈ వ్యవస్థను అమలు చేయనున్నట్లు రష్యాలోని బహ్రెయిన్ రాయబారి అహ్మద్ అబ్దుల్‌రహ్మాన్ అల్ సైతీ తెలిపారు. SPIEF-2022లో బష్కిరియా అధిపతి రాడి ఖబిరోవ్‌తో అల్ సైతీ సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మీర్’ అనేది 1 మే 2017న ఆమోదించబడిన చట్టం ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యాచే స్థాపించబడిన ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీల కోసం రష్యన్ చెల్లింపు వ్యవస్థ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రష్యన్ నేషనల్ కార్డ్ పేమెంట్ సిస్టమ్ ఈ వ్యవస్థను నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com