పవన్ నెక్స్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
- April 11, 2016పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పవన్ చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పవన్ తాజా ఇంటర్యూలో ఎస్‌జె సూర్య, త్రివిక్రమ్‌లతో తర్వాతి సినిమాలు చేస్తానని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఏ సినిమాను మొదట పట్టాలెక్కిస్తారా అని అభిమానులు ఆలోచిస్తుండగానే, పవన్ నెక్స్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి.త్రివిక్రమ్ ప్రస్తుతం అ..ఆ చిత్రంతో బిజీగా ఉన్నారు కాబట్టి .. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీకి కాస్త టైం పడుతుందనే చెప్పొచ్చు. ఖుషి, కొమరం పుటి వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్‌జె సూర్య పవన్ హీరోగా తన తాజా చిత్రాన్ని ఈ నెలలోనే గ్రాండ్‌గా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పవన్, సూర్య కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీకి అనూప్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారని తెలుస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు రికార్డింగ్ పూర్తి చేసారని టాక్. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని లాంచ్ చేయనన్నట్టు టాక్. పవన్, సూర్య కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఖుషీకి సీక్వెల్‌గా ఓ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ