దుబాయ్ లో బంగారం పూత పొదిగిన రోల్స్ రాయిస్
- June 30, 2022
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత అరుదైన కారుల్లో ఒకటైన బంగారం పూతతో పొదిగిన రోల్స్ రాయిస్ను దుబాయ్ లో ప్రదర్శించారు.
RP6W అని పిలవబడే ఈ కారును ప్రసిద్ధ ఫ్రెంచ్ కళాకారుడు తీర్చిదిద్దాడు.ఆటోమొబైల్ రంగం ప్రేమికుల కోసం మరియు సాంకేతిక అంశాలపై ఆసక్తి ఉన్నవారి కోసం ఈ కారును ప్రదర్శనలో పెట్టారు.
ఈ కారును రూపొందించిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త మరియు అంతర్జాతీయ స్థాయిలో కళా రంగంలో ప్రముఖ వ్యక్తి గా కీర్తి గడించిన ఎరిక్ ఫ్రావే ప్రముఖ పాలస్తీనా వ్యాపారవేత్త, సాంకేతిక నిపుణుడు ఒమర్ మరియు V-verse కంపెనీ ఫౌండర్ ఒమరి అబు మాది భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల అనేక మంది కళాకారులను ఈ వేదిక ద్వారా పరిచయం చేశారు.
V-verse ప్రదర్శన వేదికలో 'Metaverse' సాంకేతిక ద్వారా కారు యొక్క పూర్తి వివరాలను ప్రదర్శించారు.ముఖ్యంగా సాంకేతిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించారు.
సాంకేతిక అంశాలతో పాటుగా ఆటో మొబైల్ మరియు ఇతరత్రా రంగాల్లో వస్తున్న నూతన అవిష్కారణలు గురించి ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేందుకు V-verse వేదిక ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







