ముహరక్‌లోని పలు ప్రాంతాల్లో ఎల్ఎంఆర్ఏ తనిఖీలు

- July 02, 2022 , by Maagulf
ముహరక్‌లోని పలు ప్రాంతాల్లో ఎల్ఎంఆర్ఏ తనిఖీలు

బహ్రెయిన్: ముహరక్ గవర్నరేట్‌లోని అనేక పని ప్రదేశాలే లక్ష్యంగా లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలు నిర్వహించింది. జాతీయత, పాస్‌పోర్ట్‌లు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ముహరక్ గవర్నరేట్‌ సమన్వయంతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ అథారిటీ ఉల్లంఘనలకు సంబంధించిన అనేక నేరాలను గుర్తించి వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కార్మిక మార్కెట్ పోటీతత్వం, సౌలభ్యం, న్యాయాన్ని ప్రభావితం చేయడం లాంటి లక్ష్యాలతో ఈ డ్రైవ్ చేపట్టినట్లు రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఏదైనా లేబర్ మార్కెట్ ఉల్లంఘనలు, అక్రమ వలస కార్మికుల వ్యవహారాలు తెలిస్తే నివేదించాలని LMRA ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com