కుమార్తె మాస్ట‌ర్స్‌ డిగ్రీ పై ఏపీ సీఎం జగన్ ట్వీట్!

- July 02, 2022 , by Maagulf
కుమార్తె మాస్ట‌ర్స్‌ డిగ్రీ పై  ఏపీ సీఎం జగన్ ట్వీట్!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కుమార్తె వైఎస్ హ‌ర్షిణి రెడ్డి మాస్ట‌ర్స్‌లో స‌త్తా చాటారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌కు చెందిన వ‌ర్సిటీలో హ‌ర్షిణి మాస్ట‌ర్స్ విద్య‌న‌భ్య‌సించారు. శ‌నివారం ఆమె మాస్ట‌ర్స్ ప‌ట్టా అందుకున్నారు. మాస్ట‌ర్స్‌లో హర్షిణి రెడ్డి డిస్టింక్ష‌న్‌తో పాస్ అయ్యారు. వ‌ర్సిటీ నుంచి హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా తీసుకుంటున్న ఫొటో సోష‌ల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కుమార్తె హర్షిణి రెడ్డి మాస్ట‌ర్స్ ప‌ట్టా అందుకునే స్నాతకోత్స‌వానికి జ‌గ‌న్ దంప‌తులు పారిస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలోనే హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా పుచ్చుకున్నారు. హర్షిణి రెడ్డిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com