పబ్లిక్ బస్సులు, టాక్సీలకు ప్రత్యేక రోడ్ లేన్

- July 03, 2022 , by Maagulf
పబ్లిక్ బస్సులు, టాక్సీలకు ప్రత్యేక రోడ్ లేన్

దోహా: ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి, FIFA వరల్డ్ కప్ 2022 రవాణా షెడ్యూల్ కోసం పబ్లిక్ బస్సులు, టాక్సీలు, అధీకృత వాహనాల కోసం రింగ్ రోడ్‌లో ఒక లేన్‌ను పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రత్యేకంగా కేటాయించింది. సుప్రీం కమిటీ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మోవాసలత్ (కర్వా)తో సమన్వయంతో ఈ చర్యలు చేపట్టినట్లు

మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంగ్ అబ్దుల్ అజీజ్ అల్ మావ్లావి తెలిపారు. FIFA ప్రపంచ కప్ సందర్భంగా వేలాది మంది అభిమానులకు సాఫీగా, పర్యావరణ అనుకూల రవాణా అనుభవాన్ని అందించడానికి ప్రత్యేక బస్సు లేన్ సహాయపడుతుందన్నారు. పబ్లిక్ బస్సుల కోసం నియమించబడిన లేన్ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని, ఇది ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, రహదారిపై వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గిస్తుందని, ప్రమాద స్థలాలకు పోలీసులు, అత్యవసర వాహనాలు వేగంగా చేరుకోవడానికి కూడా ఈ లేన్ దోహదపడుతుందని కార్నిచ్ క్లోజర్ కమిటీ టెక్నికల్ టీమ్ హెడ్ ఖలీద్ నాసర్ అల్-ముల్లా పేర్కొన్నారు. రవాణా మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ నెట్‌వర్క్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ సలేహ్ సయీద్ అల్-మర్రి మాట్లాడుతూ.. ప్రపంచ కప్ సమయంలో ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు CO2 ఉద్గారాలను తగ్గించడం.. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో బస్సు లేన్ గణనీయంగా దోహదపడుతుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com