పబ్లిక్ బస్సులు, టాక్సీలకు ప్రత్యేక రోడ్ లేన్
- July 03, 2022
దోహా: ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి, FIFA వరల్డ్ కప్ 2022 రవాణా షెడ్యూల్ కోసం పబ్లిక్ బస్సులు, టాక్సీలు, అధీకృత వాహనాల కోసం రింగ్ రోడ్లో ఒక లేన్‌ను పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రత్యేకంగా కేటాయించింది. సుప్రీం కమిటీ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మోవాసలత్ (కర్వా)తో సమన్వయంతో ఈ చర్యలు చేపట్టినట్లు
మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంగ్ అబ్దుల్ అజీజ్ అల్ మావ్లావి తెలిపారు. FIFA ప్రపంచ కప్ సందర్భంగా వేలాది మంది అభిమానులకు సాఫీగా, పర్యావరణ అనుకూల రవాణా అనుభవాన్ని అందించడానికి ప్రత్యేక బస్సు లేన్ సహాయపడుతుందన్నారు. పబ్లిక్ బస్సుల కోసం నియమించబడిన లేన్ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని, ఇది ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, రహదారిపై వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గిస్తుందని, ప్రమాద స్థలాలకు పోలీసులు, అత్యవసర వాహనాలు వేగంగా చేరుకోవడానికి కూడా ఈ లేన్ దోహదపడుతుందని కార్నిచ్ క్లోజర్ కమిటీ టెక్నికల్ టీమ్ హెడ్ ఖలీద్ నాసర్ అల్-ముల్లా పేర్కొన్నారు. రవాణా మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ సలేహ్ సయీద్ అల్-మర్రి మాట్లాడుతూ.. ప్రపంచ కప్ సమయంలో ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు CO2 ఉద్గారాలను తగ్గించడం.. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో బస్సు లేన్ గణనీయంగా దోహదపడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







