రాయల్ ఒమన్ పోలీస్ పాసింగ్ఔట్ పరేడ్

- July 03, 2022 , by Maagulf
రాయల్ ఒమన్ పోలీస్ పాసింగ్ఔట్ పరేడ్

ఒమన్: నిజ్వాలోని సుల్తాన్ ఖబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్ లో రాయల్ ఒమన్ పోలీస్ గ్రాడ్యూయేట్స్ పాసింగ్ఔట్ పరేడ్ ఈ మంగళవారం అట్టహాసంగా జరుగనుంది. అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసాయిదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో అనేక మంది మంత్రులు, సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), రాయల్ ఒమన్ పోలీస్, ఇతర సైనిక అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల కమాండర్ల హాజరు కానున్నారు. సుల్తాన్ ఖబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్‌లో ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, నాన్-కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లు, పోలీస్ రిక్రూట్స్ ఇన్‌స్టిట్యూట్ వంటి అనేక శిక్షణా సంస్థలు పోలీసు కళాశాలతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com