మెగా పవర్ స్టార్‌తో శంకర్ ప్రయోగం: అంచనాలు పెంచేస్తోందిగా.!

- July 03, 2022 , by Maagulf
మెగా పవర్ స్టార్‌తో శంకర్ ప్రయోగం: అంచనాలు పెంచేస్తోందిగా.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పలు రకాల టైటిల్స్ పరిశీలనలో వున్నాయ్. అందులో ఒకటి ‘సిటిజన్’. అనే టైటిల్. కాగా, ఈ సినిమాకి సంబంధించి మరో కీలకమైన అప్‌డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న రకాల పాత్రల్లో కనిపించనున్నాడట. అంటే డబుల్ రోల్ అన్నమాట. అందులో ఒకటి తండ్రి పాత్రని తెలుస్తోంది. తండ్రి పాత్ర చాలా డిఫరెంట్ లుక్స్‌లో వుండబోతోందట. ఆ లుక్‌కి చరణ్ చాలా బాగా సెట్టయ్యాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

గతంలో చరణ్ డబుల్ రోల్ పోషించిన ‘నాయక్’ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ తొలి నాళ్లలో చేసిన సినిమా ఇది. కానీ, ఇప్పుడు చరణ్ స్టార్ హీరో. అందులోనూ ప్యాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న హీరో కావడంతో, ఇప్పుడు చరణ్‌పై అంతులేని అంచనాలున్నాయి.

సో, శంకర్ చేసే ఈ ప్రయోగం ఖచ్చితంగా ఫెయిల్ అవ్వకూడదు. ‘ఆర్ఆర్ఆర్’తో బీభత్సమైన సక్సెస్ అందుకున్న చరణ్, ఆ వెంటనే ‘ఆచార్య’తో డిజాస్టర్ చవి చూసిన సంగతి తెలిసిందే. అందుకే శంకర్ సినిమా విషయంలో ఇంకాస్త జాగ్రత్రగా వుండాల్సిన అవసరం వుంది.
ప్రస్తుతం అమృత్ సర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత హైద్రాబాద్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్‌కి ప్లాన్ చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ నటిస్తోంది. అలాగే, అంజలి, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com