మళ్లీ వివాదాల్లోకెక్కిన రాహుల్ రామకృష్ణ: ఎందుకిలా చేస్తున్నాడో.!
- July 03, 2022
స్టార్ కమెడియన్‌గా ప్రస్తుతం చెలామణీ అవుతోన్న రాహుల్ రామకృష్ణ ఈ మధ్య వివాదాలతో కూడా ఎక్కువగా సావాసం చేస్తున్నాడు. అదేం తుత్తో కానీ, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా వుండే ఈ కుర్ర కమెడియన్ వివాదాల్లోనూ యాక్టివ్ పర్‌ఫామెన్స్ ఇస్తున్నాడు.
మొన్నా మధ్య కాబోయే భార్యతో లిప్ లాక్ ఫోటో పెట్టి పెళ్లి న్యూస్ రివీల్ చేసి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అన్ని విషయాలపైనా తనదైన స్టయిల్లో స్పందిస్తూ చాలా సార్లు వివాదాలకెక్కాడు. తాజాగా ‘డాష్..లో దమ్ముంటే సినిమాలు తీయండి ఇడియట్స్’ అంటూ రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్ చేశాడు.
అయితే, ఆ ట్వీట్ మీనింగ్ ఏంటో తెలుసుకునేలోపే దాన్ని డిలీట్ చేసేశాడీ ప్రబుద్దుడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ నెట్టింట స్వైర విహారం చేసేసి, చేయాల్సిన రచ్చంతా చేసేసిందంనుకోండి. అయితే అసలు విషయమేంటంటే, అసలెందుకు రాహుల్ ఇలాంటి ట్వీట్ చేయాల్సి వచ్చింది.? క్రిటిక్స్‌ని వుద్దేశించి ట్వీటేశాడా.? లేక, రివ్యూ రైటర్స్‌ని వుద్దేశించి చేశాడా.? అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.
నెటిజన్లు ఆరా తీయగా, అసలు ఆ ట్వీట్ తనది కానే కాదంటూ ప్లేట్ ఫిరాయించేస్తున్నాడట. ఎందుకు రాహుల్ రామకృష్ణ ఇలా చేస్తున్నాడు.? ఇదంతా పబ్లిసిటీ కోసమేనా.? అంటూ నెటిజన్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాహుల్ రామకృష్ణ కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో తనదైన బాడీ లాంగ్వేజ్, సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శిస్తూ, యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇటీవల ‘అంటే సుందరానికి’ సినిమాలో రాహుల్ రామకృష్ణ నటించాడు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







