భార్య ఇతర మతస్థురాలైతే స్వతంత్ర ఇకామా తీసుకోవాలి
- July 03, 2022
రియాద్: వలస దారుల కుటుంబానికి చెందిన వ్యక్తి యొక్క భార్య మరియు పిల్లలు కోరకు ఇకామా (నివాస వీసా) కోసం దరఖాస్తు చేసుకోవాలి.అంతేకాకుండా సదరు వ్యక్తి యొక్క భార్య ఇతర మతస్థురాలైతే న్యాయ బద్దంగా SR500 చెల్లించి స్వతంత్ర ఇకామా కు దరఖాస్తు చేసుకోవాలి అని దేశ పాస్ పోర్ట్స్ శాఖ(jawazat) పేర్కొంది.
ఇకామా పొందేందుకు ముందుగా వలసదారు కుటుంబ పెద్ద దరఖాస్తు నింపాలి.అందులోని వ్యక్తిగత సమాచారం పాస్ పోర్ట్ లలో ఉన్న సమాచారం తో సరిపోలాలి.ఆ తర్వాత తన భార్యా పిల్లల కోరకు ఇకామా పొందడానికి వారి పాస్ పోర్ట్ లను పరిశీలించడం జరుగుతుంది.అలాగే , సౌదీ రాయబార కార్యాలయం ఇచ్చిన వీసా పత్రాలు, తమకు స్పాన్సర్ చేసే వ్యక్తి యొక్క వివరాలను మరియు సంభందిత న్యాయ పరమైన పత్రాలను సమర్పించాలి.
అలాగే సౌదీ అరేబియా లో ఉంటున్న వ్యక్తిని వివాహాం చేసుకున్న ఇతర మతస్థురాలైతే పాస్ పోర్ట్ సంస్థ నియమాలకు లోబడి ఇకామా కోసం తమ వివాహా గుర్తింపు కార్డు కాపీ మరియు సంభందిత ఫీజు చెల్లింపు చేయాలి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







