దళిత బంధు ఇవ్వాలని గల్ఫ్ మృతుడి కుటుంబం విజ్ఞప్తి

- July 04, 2022 , by Maagulf
దళిత బంధు ఇవ్వాలని గల్ఫ్ మృతుడి కుటుంబం విజ్ఞప్తి

తెలంగాణ: గత ఐదేళ్లుగా ఇంటికి రాకుండా షార్జా లోనే ఉంటున్న బచ్చల రాజనర్సయ్య అనే వలస కార్మికుడు అప్పుల బాధ భరించలేక అక్కడే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇటీవల జరిగింది.ఇతని స్వస్థలం జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్. 

తమను ప్రభుత్వం ఆదుకోవాలని...గల్ఫ్ మృతుడు రాజనర్సయ్య భార్య బచ్చల జమున సోమవారం (04.07.2022) నాడు జగిత్యాల జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  ఒక దరఖాస్తు సమర్పించారు.ఆమె వెంట గల్ఫ్ కాంగ్రెస్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఉన్నారు. 

తాము నిరుపేద దళితులమని తమ కుటుంబానికి రూ.10 లక్షల విలువైన దళిత బంధు పథకం మంజూరు చేయాలని ఆమె కోరారు. లేదా ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలని కోరారు.లేదంటే కనీసం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అయినా ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.తన పెద్ద కూతురు సౌందర్యకు పెళ్లి అయిందని,చిన్న కూతురు సంధ్య డిగ్రీ,కుమారుడు వినయ్ ఇంటర్ చదువుతున్నారని జమున తెలిపారు.తాను దినసరి కూలీ చేస్తున్నాని అన్నారు. 

ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ (టిపిసిసి) ప్రవాస భారతీయులు విభాగం (ఎన్నారై సెల్) గల్ఫ్ డివిజన్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూ... గత ఎనిమిది ఏళ్ళలో గల్ఫ్ దేశాలలో 1,600 మంది తెలంగాణ కార్మికులు చనిపోయారు.వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com