‘బింబిసార’ ట్రైలర్ విడుదల
- July 04, 2022
హైదరాబాద్: కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రం తాలూకా ట్రైలర్ విడుదలైంది. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్..ప్రస్తుతం బింబిసార అనే హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు.శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ చిత్రం నుండి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్నా?’ అని ఓ బాలుడు ప్రశ్నించగా.. ‘ఓ మహా చక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి’ అని తండ్రి చెప్పే వాయిస్ ఓవర్ తో ‘బింబిసార’ ట్రైలర్ ప్రారంభమైంది. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్ సంభాషణలు, విజువల్స్‌తో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ‘బింబిసారుడంటే మరణశాసనం’.. ‘ ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’.. లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రెండు వేర్వేరు టైమ్ లైన్ లో గతంలోనూ మరియు వర్తమానంలోనూ నడుస్తున్నట్లు సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ రెండిటినీ ఎలా కనెక్ట్ చేసారనేది ఆసక్తికరం. ఇక ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.మరి మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!









