గణనీయమైన వృద్ధి సాధించిన ఖతార్ రియల్ ఎస్టేట్
- July 05, 2022
ఖతార్: FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022 నిర్వహణ వేళ ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ నేపథ్యంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు పెరుగుతున్నాయని ఎండీ ప్రాపర్టీస్‌లోని రియల్ ఎస్టేట్ సర్వీసెస్ హెడ్ అయాన్ డిను తెలిపారు. సెవెన్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎలీస్ సెల్మెనే మాట్లాడుతూ.. 2015 నుండి మొదటిసారిగా ఖతార్‌లో అద్దె ధరలలో పెరుగుదల నమోదు అయిందన్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2022 రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ప్రకారం.. ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏప్రిల్‌లో సానుకూల దృక్పథాన్ని నమోదైంది. రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ 330 రియల్ ఎస్టేట్ ఒప్పందాలకు QR2bn మించిపోయింది. ఇందులో 31 శాతం దోహా మునిసిపాలిటీలో నమోదు కావడం విశేషం. మోర్డోర్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. ఖతార్‌లోని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అంచనా వ్యవధిలో (2022-2027) 11.5 శాతానికి పైగా వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదు చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







