450 మంది షార్జా పోలీసులకు ఆర్థిక పదోన్నతి
- July 05, 2022
షార్జా: పోలిస్ విభాగంలో చేరిన నాటి నుండి షార్జా పోలీసు విభాగంలోనే పనిచేస్తున్న 450 మంది నాన్ కమిషన్డ్ అధికారులకు ఆర్థిక పదోన్నతి ఇచ్చేందుకు షార్జా పాలకుడు మరియు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహ్మద్ అల్ కసిమి అంగీకరించారు.
నాన్ కమిషన్డ్ అధికారులు పోలీసింగ్ సంబంధించిన కోర్సును షార్జా పోలీస్ విభాగం అధ్వర్యంలో నడుస్తున్న షార్జా పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్నారు.
షార్జా పోలీస్ విభాగ అధిపతి మేజర్ జనరల్ సైఫ్ అల్ జారీ షంశి ఆర్థిక పదోన్నతి అంశం గురించి షార్జా రేడియో మరియు టీవి ద్వారా ప్రకటించారు. ఈ సమయంలోనే పదోన్నతులు కల్పించిన షార్జా పాలకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
షార్జా పోలీస్ విభాగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తన వంతు కృషి చేస్తున్న సుల్తాన్ కు మరియు పదోన్నతి పొందిన అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అధికారులను ఉద్దేశించి ప్రజల భద్రతా కోసం పోలిస్ విభాగంలో పనిచేస్తున్న మీరు అంకిత భావంతో ఎల్లప్పుడూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మేజర్ జనరల్ షంశి ఉద్ఘాటించారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







