తెలుగమ్మాయ్ పెదాలకు సర్జరీ జరిగిందా.?
- July 06, 2022
అందాల భామ అనన్య నాగళ్ల గురించి అందరికీ తెలిసిందే. ‘ప్లే బ్యాక్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘వకీల్ సాబ్’ సినిమాతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సమంతతో కలిసి ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది అనన్య నాగళ్ల.
ఇక, సోషల్ మీడియాలో అనన్యా నాగళ్ల ఓ సెన్సేషన్. అవర్ గ్లాస్ ఫిజిక్‌తో కుర్రోళ్లకు ఘాటైన వలలు విసరడంలో ఆరి తేరిపోయింది ఈ తెలుగమ్మాయ్. తెలుగమ్మాయిలు గ్లామర్‌కి దూరం అనే మాటను దూరం చేసేసింది తన హాట్ అలర్ట్‌తో.
అయితే, తాజాగా అనన్య నాగళ్లకు హీరోయిన్గా ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందట. ఓ సినిమా ఫంక్షన్లో ఈ విషయం అనన్య స్వయంగా చెప్పింది. కథ, కథనాలు చాలా బాగుంటాయ్. నాకు కథ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.. అంటూ ఫ్యాన్స్‌నుద్దేశించి అనన్య మాట్లాడింది.
అయితే, ఆ సినిమా టైటిల్ ఏంటీ.. ఆ కథేంటీ.? అనే విషయం చెప్పలేదు అనన్య. ఆ సంగతి అటుంచితే, అన్ని మాటలు చెప్పినా, ఆడియన్స్ దృష్టికి అవేం పెద్దగా ఎక్కలేదు. కానీ, అనన్య పెదాలపై ఆడియన్స్ దృష్టి ఎక్కువగా మళ్లింది ఈ సారి.
ఎందుకంటే, అనన్య పెదాలు ఇంతకు ముందు కన్నా కాస్త భిన్నంగా కనిపించడమే అందుకు కారణం. దాంతో, అనన్య పెదాలకు సర్జరీ చేయించుకుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగానే అనన్య పెదాలకు సర్జరీ జరిగిందా.? జరిగితే జరిగి వుంటుంది. సెలబ్రిటీలకు ఇలాంటి సర్జరీలు చాలా చాలా కామన్ కదా.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







