ఆకాశ ఎయిర్‌కు DGCA అనుమతి..
- July 07, 2022
న్యూ ఢిల్లీ: మరో కొత్త విమానయాన సంస్థ త్వరలో సేవలు ప్రారంభించబోతుంది. ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా భాగస్వామిగా ఉన్న ‘ఆకాశ ఎయిర్’కు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈ నెల చివరి వారం నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు సంస్థ రెడీ అవుతోంది.
విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ మొదటగా ‘బోయింగ్ 737 మ్యాక్స్’ అనే విమానాన్ని గత ఏడాది జూన్ 21న డెలివరీ తీసుకుంది. మొత్తం ఇలాంటి 72 విమానాల్ని ఆర్డర్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. గత సోమవారం సంస్థ సిబ్బంది ధరించే యూనిఫామ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ సంస్థ విమాన సర్వీసులు ఎలా ఉంటాయి అనే అంశాన్ని పరిశీలించిన తర్వాత డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం విమానాల్ని అనేక సార్లు ట్రయల్ రన్ చేసి చూపించాలి.
నిర్ధిష్ట పరీక్షలన్నీ పాసయ్యాకే విమానయాన సంస్థలకు అనుమతులు ఇస్తారు.డీజీసీఏ అనుమతులు మంజూరు చేయడంపై ఆకాశ ఎయిర్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇది కొత్త అధ్యయనానికి నాంది అని, ఈ నెల చివరి వారం నుంచి సేవలు ప్రారంభిస్తామని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం ఈ సంస్థకు 18 విమానాలు ఉన్నాయి. ప్రతి ఏడాది 12-14 కొత్త విమానాలు ప్రారంభమవుతాయి. మొత్తం 72 విమానాలు కంపెనీలో చేరుతాయి.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









