‘ఘోస్ట్’ అవతారమెత్తిన బంగార్రాజు.!
- July 07, 2022
సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘బంగార్రాజు’ అంచనాల్ని అందుకోలేకపోయిందన్న టాక్ వుంది. కరోనా ప్యాండమిక్ కారణంగా అలా అలా పూర్తి చేసేసి రిలీజ్ చేసేసి చేతులు దులిపేసుకున్నారన్న ప్రచారమూ వుంది ఈ సినిమాపై. దాంతో ఏదో అలా కొట్టుకుపోయిందంతే.
ఆ తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. విలక్షణ టాలెంట్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారుతో సినిమా అంటే, ఈ సినిమాపై కొన్ని అంచనాలున్నాయ్. చిన్న సినిమాలకు పెద్ద దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారు, నాగార్జునతో సినిమా అంటే చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడట.
దాంతో ఈ సినిమాని భారీ స్థాయిలో అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనేలా రూపొందిస్తున్నాడట. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగార్జున ఫస్ట్‌లుక్ పోస్టర్ అది. చాలా ప్రామిసింగ్‌గా వుంది ఈ పోస్టర్. సినిమాపై అంచనాలు పెరిగేలాగే వుంది.
ఈ సినిమాకి సంబంధించి విజువల్ అప్‌డేట్‌ని జూలై 9న రిలీజ్ చేయనున్నారట. ఆ విజువల్ నెక్స్‌ట్ లెవల్‌లో వుండబోతోందని అంటున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి మీదున్నాడట నాగ్. భారీ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సరికొత్త కథా, కథనాలతో రూపొందిన సినిమాగా ‘ది ఘోస్ట్’ని అభివర్ణిస్తున్నారు. అందాల భామ సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో నాగ్‌తో జోడీ కడుతోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







