‘షీసా’‌తో కిక్కెక్కిస్తోన్న అన్వేషి జైన్: రామారావుకి కలిసొస్తుందా.?

- July 07, 2022 , by Maagulf
‘షీసా’‌తో కిక్కెక్కిస్తోన్న అన్వేషి జైన్: రామారావుకి కలిసొస్తుందా.?

మొన్న ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’ అంటూ సమంత స్పెషల్ సాంగ్ ఓ రేంజ్‌లో కిక్కిచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడ విన్నా అదే పాట ఓ రేంజ్‌లో ఊపు ఊపేసింది ఆ స్పెషల్ సాంగ్.ఇప్పుడు అదే తరహాలో ‘సీసా..’ సాంగ్ ఉర్రూతలూగిస్తోంది. 
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’లోనిది ఈ స్పెషల్ సాంగ్. అన్వేషి జైన్ ఈ సాంగ్‌లో నటించింది. తన భారీ అందచందాలతో మత్తెక్కించేస్తోంది ఈ పాటలో అన్వేషి జైన్.

సినిమా సంగతెలా వున్నా, ఈ పాటతో సినిమాకి కొత్త ఊపు వచ్చినట్లయ్యింది. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా రిలీజ్‌కి రవితేజనే కారణమంటూ మొన్నా మధ్య వార్తలు వినిపించాయ్. తనకివ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని రవితేజ షూటింగ్ ఆపేశాడనీ, ఆ కారణంగానే సినిమా రిలీజ్ లేటయ్యిందంటూ మేకర్లు గగ్గోలు పెడుతున్నారనేది ఆ వార్త సారాంశం.

ఏం జరిగిందో ఏమో కానీ, తాజాగా ఆ వార్తల్లో నిజం లేదంటూ మళ్లీ వాళ్లే కొత్తగా ప్రచారం మొదలు పెట్టారట.ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయ్. ఆ నేపథ్యంలోనే అన్వేషి జైన్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి, సినిమాకి కొత్త ఊపు తీసుకొచ్చారు. ఈ సినిమాలో రాజిషా విజయన్, దివ్యాంశ కౌషిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com