కోలీవుడ్ హీరో విశాల్: రెండు లవ్ స్టోరీస్ అవుట్, కొత్తగా లవ్‌లో పడ్డాడా.?
- July 08, 2022
తెలుగు కుర్రాడే అయినా విశాల్ తమిళ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. గతంలో అర్జున్ రెడ్డి ఫేమ్ అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్మెంట్ చేసుకుని, పెళ్లి పీటల వరకూ చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆ నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్.
అంతకు ముందే, శరత్ కుమార్ తనయ వరలక్ష్మితోనూ పీకల్లోతు ప్రేమాయణం కొనసాగించి ఆ ప్రేమను కూడా పెళ్లి దాకా తీసుకెళ్లలేకపోయాడు. తాజాగా మరోసారి విశాల్ ప్రేమలో వున్నట్లు తెలుస్తోంది. తెలియడమేంటీ.? స్వయానా విశాల్ బాబే తాను ప్రేమలో వున్నాననీ, అరేంజెడ్ మ్యారేజ్లు తన ఒంటికి పడవంటూ త్వరలోనే తన లవర్ని పరిచయం చేస్తానని ఫ్యాన్స్‌తో చెప్పాడట.
కాస్త విచిత్రంగానే వుంది. ఇంతవరకూ మనం చెప్పుకున్న వాటిల్లో అరేంజెడ్ మ్యారేజ్లు ఏమున్నాయ్.. అన్నీ లవ్ స్టోరీలే కదా.. అనుకుంటే మా తప్పు కాదు.. విశాల్ బాబు అలా సెలవిచ్చాడట ఇక్కడ లాజిక్కులు వెతకొద్దు.
సరే పోనీ, ఇంతకీ విశాల్ కొత్త లవర్ ఎవరంటా.? ఆ విషయం మాత్రం అడగొద్దు. ఇప్పటికయితే సస్పెన్సే. త్వరలోనే రివీల్ చేస్తాడట విశాల్. ఇక, విశాల్ ప్రస్తుతం ‘లాఠీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం పలకల బాడీతో కుస్తీ పట్టులు పడుతున్నాడట విశాల్. అదీ సంగతి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







