మాజీ ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు
- April 12, 2016
బుడైయాలోని ఓ కెఫెటేరియా ఉద్యోగి, మాజీ ఉద్యోగి వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొడుతున్నాడనీ, హింసిస్తున్నాడనీ ఫిర్యాదులో బాధితుడు మొహమ్మద్ ఫైసల్ పేర్కొన్నారు. బుడైయాలోని కెఫెటేరియాలో పనిచేస్తున్న మొహమ్మద్ ఫైసల్, తనకు చెడ్డ పేరు వచ్చేలా ఆ మాజీ ఉద్యోగి వ్యవహరిస్తున్నాడనీ, అలాగే తన పాస్పోర్ట్ విషయంలోనూ వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించాడు. డబ్బు దొంగిలించినట్లుగా ఒప్పుకోవాలని తనపై మాజీ ఉద్యోగి వేధింపులకు దిగాడనీ, స్నేహితులతో కలిసి వచ్చిన అతడు తనను కొట్టాడని, 2000 బహ్రెయినీ దినార్ల కోసం ఇదంతా చేస్తున్నాడని ఫైసల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేక తాను ఉద్యోగం నుంచి బయటకు వచ్చాననీ, ఇండియన్ ఎంబసీ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఫైసల్ వివరించాడు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







