అతివాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకమవ్వాలి
- April 12, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ - డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిల్ మమాద్ అల్ ఖలీఫా, అతి వాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. గుడైబా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో వీరు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. ఇస్లామిక్ దేశాల్లో ఆర్థిక, సామాజిక స్థితిగతులపైనా ఈ సందర్భంగా చర్చ జరిగింది. గల్ఫ్ దేశాల్లో పరిస్థితుల గురించీ చర్చించారు. తీవ్రవాదంపై చర్చించిన వీరు, ఏ రూపంలో ఉన్నా తీవ్రవాదాన్ని సహించరాదని, ప్రపంచమంతా ఈ విషయంలో ఒక్కతాటిపైకి రావాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చర్చా కార్యక్రమాలు, సమావేశాలు జరగాలని, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







