‘రామారావు’పై రవితేజ సైలెన్స్: ఇలాగైతే కష్టమే రాజా.!

- July 09, 2022 , by Maagulf
‘రామారావు’పై రవితేజ సైలెన్స్: ఇలాగైతే కష్టమే రాజా.!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇంతవరకూ ఈ సినిమా ప్రమోషన్లలో రవితేజ ఎక్కడా కనిపించడం లేదు. డైరెక్టర్ ఏదో ఒకటీ అరా ఇంటర్వ్యూలతో నెట్టుకొస్తున్నాడు. 
కానీ, హీరో, హీరోయిన్లు సినిమాని బొత్తిగా పట్టించుకోవడం లేదు. అసలే రవితేజపై రకరకాల రూమర్లున్నాయ్ ఈ సినిమాకి సంబంధించి. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా రవితేజ కారణంగానే విడుదల ఆలస్యమైందన్న ప్రచారం జరిగింది. 
ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా, ప్రమోషన్ బాజా ఇంకా మోగలేదు. ఓ రేంజ్‌లో ప్రమోషన్లు చేస్తున్నా ఆయా సినిమాల రిజల్ట్ రిలీజ్ తర్వాత తుస్సుమనిపోతోంది. అలాంటిది, అస్సలు అలికిడే లేకుంటే ఎలా మాస్ రాజా.. అంటూ ఆయన అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. అసలెందుకు ‘రామారావు’ విషయంలో రవితేజ అంత సైలెంట్‌గా వున్నాడో ఫ్యాన్స్‌కి అర్ధం కావడం లేదు.
ఈ సినిమాకి తెర వెనుక ఏదో గట్టిగానే లొల్లి జరుగుతోందన్న అనుమానాలు వస్తున్నాయ్. అలాగే ఇంతవరకూ జరిగిన ప్రచారాలు కూడా నిజమే అనిపిస్తున్నాయ్ తాజా పరిస్థితులు చూస్తుంటే. ఇలాగైతే కష్టమే మాస్ రాజా.
అసలే ‘ఖిలాడీ’ సినిమా రిజల్ట్ అంతంత మాత్రమే. విడుదలకు ముందు అంత హడావిడి చేసినా ఆ సినిమా భవితవ్యం అలా తేల్చేశారు ప్రేక్షకులు. అలాంటిది ‘రామారావు’ పరిస్థితి ఏంటో. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com