మౌన దీక్ష ప్రారంభించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
- July 11, 2022
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో మౌన దీక్ష ప్రారంబించారు. గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు. ‘‘ఇదిగో కుర్చీ.. సమస్యలను పరిష్కరించు కేసీఆర్ అంటూ’’ కమలం శ్రేణులు యెద్దేవా చేశారు.
ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని ఆరోపిస్తోంది. కాగా… ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317జీవో రద్దు కోసం జనవరిలో దీక్షకు దిగగా… అనుమతి లేదంటూ అప్పట్లో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూములు, గిరిజన సమస్యపై బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ జగపతి రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







