ధ్యాంక్యూ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు!
- July 11, 2022
హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో మరోసారి చైతూ-విక్రమ్ కుమార్ కాంబినేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక పూర్తిగా ఫీల్ గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాగ చైతన్య మూడు విభిమన్నమైన లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నాడు. కాగా హీరో జీవితంలో చోటుచేసుకునే సంఘటనల వల్ల అతడు చివరికి ఎలా మారుతాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్‌గా ఉండబోతుందని ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో చైతూ నటన మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో అందాల భామ రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 12న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
The magic word Thank You is all set to cast its magic✨#ThankYouTheMovie trailer to release on 12th July @ 6:03 PM@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram
— chaitanya akkineni (@chay_akkineni) July 11, 2022
@RaashiiKhanna_@BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @adityamusic pic.twitter.com/w5jGTMVtza
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







