మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన షిండే సర్కారు
- July 14, 2022
ముంబై: మహారాష్ట్ర ప్రజలకు సిఎం ఏక్నాథ్ షిండే శుభవార్త తెలిపారు. భారీగా పెరిగిన ఇంధన ధరల విషయంలో కొంత ఊరట కల్పించారు. మహారాష్ట్రలో లీటరు పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 3 తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ముంబైలో గత పదకొండు రోజులుగా రూ. 111.35 గా ఉన్న లీటరు పెట్రోలు తాజా తగ్గింపుతో రూ. 106.35కు తగ్గనుంది. ఇప్పటిదాకా రూ. 97.28గా ఉన్న లీటరు డీజిల్ ఇకపై 94.28 కే లభించనుంది.
ఇతర నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు ముంబైలోనే ఎక్కువగా ఉండటంతో షిండే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. బుధవారం నాటికి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.96.72, కోల్ కతాలో రూ.106.03, చెన్నైలో రూ.102.63, గువాహటిలో రూ. 96.48గా ఉన్నాయి. లీటరు డీజిల్ రేట్లు ఢిల్లీలో రూ.89.62, కోల్ కతాలో రూ.92.76, చెన్నైలో రూ.94.24, గువాహటిలో రూ. 84.37గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 109.66 కాగా, డీజిల్ రేటు రూ. 97.82గా ఉంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







