తగ్గేదే లే.. అంటోన్న కుర్రహీరో: కొత్త టైటిల్‌తో వస్తున్న కిరణ్ అబ్బవరం.!
- July 16, 2022
కుర్రహీరోల్లో తనదైన దూకుడు చూపిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. మొన్నీ మధ్యనే ‘సమ్మతమే’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ కుర్ర హీరో, ఇప్పుడు ‘మీటర్’ అంటూ కొత్త సినిమాతో వస్తున్నాడు.
ప్రతిష్ఠాత్మకమైన పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీస్ బ్యానర్లో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమాకి ‘మీటర్’ అనే టైటిల్ ఖరారు చేస్తూ, ఫస్టలుక్ పోస్టర్ వదిలారు.
ఈ రోజు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భంగా మైత్రీ మూవీస్ బ్యానర్ వాళ్లు ఈ రకంగా కొత్త సినిమా టైటిల్ వదిలి, మనోడికి బర్త్‌డే ట్రీట్ ఇచ్చారన్న మాట.
ఇకపోతే, కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమాల లిస్టు చాలా పెద్దదే కావడం విశేషం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో కిరణ్ అబ్బవరం, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా చేస్తున్నాడు. అలాగే, కోడి దివ్య ప్రొడక్షన్స్‌లో ‘నేను మీకు బాగా కావలిసిన వాడిని’ అంటున్నాడు.
ఏ యంగ్ హీరో లేనంత బిజీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కిరణ్ అబ్బవరం. సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన కిరణ్ అబ్బవరం, సినిమాలపై వున్న ఆసక్తితో హీరోగా మారాడు. ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండానే, సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకుంటున్నాడు. తనదైన మార్కు డైలాగ్ డెలివరీతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యడు కిరణ్ అబ్బవరం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







