వెబ్ సిరీస్‌కి సినిమా రేంజ్ బిల్డప్ ఇస్తున్నారుగా.!
- July 16, 2022
అక్కినేని కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమైన సుశాంత్ ఓటీటీ తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల నట్టింట్లో హంగామా షురూ చేశాడు సుశాంత్.
ఈ వెబ్ సిరీస్‌కి విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. నేచురల్ స్టార్ నానితో ఈ వెబ్ సిరీస్‌ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయించిన ‘నీళ్ల ట్యాంక్’ అండ్ టీమ్ తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేసింది.
ఆ ఈవెంట్‌లో ఫన్నీగా కమెడియన్ సుదర్శన్‌తో కలిసి సుశాంత్ స్టేజ్ పైనే ఓ స్కిట్ చేశాడు. సినిమాల్లో అవకాశాల్లేకపోతే, వెబ్ సిరీస్‌లు చేసేస్తావా.? అంటూ యాంకర్ ప్లేస్‌లో వున్న సుదర్శన్ అడగ్గా, అందుకు సుశాంత్ ఘాటైన కౌంటర్ ఇచ్చి ఎంటర్‌టైన్ చేశాడు.
ఏ వెబ్ సిరీస్‌లు చేస్తే తప్పేంటీ.? కంటెంట్ వున్నోడికి కటౌటౌతో పనేముంది.? అన్నట్లుగా ‘మా నీళ్ల ట్యాంక్’ కంటెంట్ చూసి మాట్లాడవోయ్..’ అన్నట్లుగా సుదర్శన్‌కి సమాధానమిచ్చాడు.
‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ‘లీడర్’ ఫేమ్ ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది. ప్రోమోస్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తున్నాయ్. చూడాలి మరి, నెట్టింటి ప్రేక్షకుల్ని ఆ రేంజ్‌లో అలరిస్తుందో లేదో ‘మా నీళ్ల ట్యాంక్’.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







