27న అబుదాబిలో ఉచిత న్యాయసహాయ శిబిరం

- June 14, 2015 , by Maagulf
27న అబుదాబిలో ఉచిత న్యాయసహాయ శిబిరం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఏ ఈ) రాజధాని అబుదాబి లో ఈ నెల 27న ఉచిత న్యాయ సహాయ శిబిరం జరుగుతుందని షార్జాకు చెందిన ప్రవాసి కార్మిక నాయకుడు శ్రీ జనగామ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా మరియు సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ సంస్థలు సంయుక్తంగా ఈ లీగల్ క్లినిక్ ను అబుదాబి లోని కేరళ సోషల్ సెంటర్ హాల్ లో సాయంత్రం 5 గం.లకు ఇఫ్తార్ విందుతో నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రవాసీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 

 

వివరాలకు శ్రీ జనగామ శ్రీనివాస్, షార్జా మొబైల్ నెం. 00971 50 5490298 లేదా 

మంద భీంరెడ్డి, హైదరాబాద్ సెల్ నెం. 0091 98494 22622 కు సంప్రదించాలని ఆయన సూచించారు. 

 

--యం.భీంరెడ్డి(హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com