దుబాయ్ మెట్రోలో 'ఫ్రీ వైఫై'
- June 14, 2015
దుబాయ్ మెట్రో రైళ్ళలో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వైఫై అందుబాటులో ఉన్నా, వినియోగదారుల నుంచి కొంత ఛార్స్ వసూలు చేస్తున్నారు సర్వీస్ ప్రొవైడర్స్. అయితే రంజాన్, ఇతర అకేషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని సర్వీస్ ప్రొవైడర్స్ మెట్రో రైళ్ళు, ఇతర ప్రాంతాల్లో వినియోగదారులకు ఉచితంగా వైఫైని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికిది టెంపరరీ సర్వీస్ అయినా రానున్న రోజుల్లో పూర్తిగా ఉచితంగా వినియోగదారులకు వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్ ట్రామ్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, నాలెడ్జ్ విలేజ్, దుబాయ్ మీడియా సిటీ, ఎమ్మార్ బౌలెవార్డ్, గ్లోబల్ విలేజ్, డు షాప్స్ ఇవన్నీ వైఫై కనెక్టెడ్ ప్రాంతాలు ఇప్పటివరకూ. ఈ సంవత్సరం ‘డు’ సంస్థ దుబాయ్ మెట్రోతోపాటు యూఏఈలోని 200 ప్రాంతాల్లో వైఫైని అందుబాటులోకి తీసుకొస్తుంది. స్మార్ట్ యూఏఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







